
Auto LPG Price Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఎల్పీజీ ధరలు..లీటరు రూ.106కి అమ్ముతున్న ఫిల్లింగ్ స్టేషన్లు!
Bengaluru, Karnataka:Auto LPG Price Hike News: ఇండియన్ ఆయిల్ (IOCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో బెంగళూరులో కార్యకలాపాలు చేస్తున్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఆటో ఎల్పీజీ (Auto LPG) ధరలు లీటరుకు రూ.11.78 పెంచేందుకు నిర్ణయించారు. అయితే ఈ పెంపు అనేది ఏప్రిల్ 1 నుంచి అములులోకి వస్తుందని తెలియజేశారు. దీంతో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు రూ.89.52కు చేరింది. చివరి సవరణ 2026 మార్చి 20న జరగ్గా..అప్పుడు ఎల్పీజీ ధర లీటరుకు రూ.77.74గా విక్రయించారు. అయితే యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరను ఆసరాగా తీసుకోని పలు ప్రైవేట్ ఆటో ఎల్‌పిజి స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు వసూలు చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఆటో ఎల్‌పిజి ఫిల్లింగ్ స్టేషన్లు డ్రైవర్లను దోచుకుంటున్నాయని ఆరోపించారు. "ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ (IOCL) నిర్ణయించిన ఆటో ఎల్‌పిజి ధర రూ.89.52 విక్రయిస్తుండగా.. బెంగళూరులోని అనేక ప్రైవేట్ చమురు ఫిల్లింగ్ స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. అందులోనూ ఆటో ఎల్పీజీ కోసం 2 కిలోమీటర్ల వరకు క్యూలో వేచి చూడాల్సి వచ్చేంది." అని ఆటో డ్రైవర్ సంఘాలు తెలిపాయి. ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటగా..ఇప్పుడు ఆటో గ్యాస్ గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంద
చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆటో గ్యాస్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఆటో డ్రైవర్లు ఎలా బ్రతుకుతారు?
పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఆయా దేశాల సమన్వయ దాడులు నేపథ్యంలో ప్రతీకార చర్యలు భారీగా మొదలయ్యాయి. దీంతో ప్రపంచంలోని ఇంధన వాణిజ్య మార్గమైన కీలక హోర్ముజ్ జలసంధి నుంచి నౌకాయానానికి అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలను పెరిగిన క్రమంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించింది.
ఆటో ఎల్పీజీ ఇంధన కొరత కారణంగా ఆటో డ్రైవర్లు కూడా ప్యాసింజర్స్ నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెంచినట్లు ఓ ఆటో ఎల్పీజీ డీలర్ తెలియజేశారు. "గత వారం ఒక టన్ను ఎల్‌పిజి ధర సుమారు రూ.60,000 ఉండేది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాని ధర దాదాపు రూ. 1.90 లక్షలకు చేరింది. సరఫరా సరిపోవడం లేదు. చాలా ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడుతున్నాయి, ఉన్నవాటిలో కొన్ని ఎక్కువ వసూలు చేస్తున్నాయి," అని ఆ డీలర్ అన్నారు.
అయితే కర్ణాటక రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కొరత లేదని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. మార్చి 29, 2026 నాటి పత్రికా ప్రకటనలో.. ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలచే నిర్వహిస్తున్న కర్ణాటక వ్యాప్తంగా ఉన్న 72 ఆటో ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్లలో (ALDS), బెంగళూరులోని 31 స్టేషన్లతో సహా ఆటో ఎల్‌పీజీ సులభంగా అందుబాటులో ఉందని ఆ శాఖ పేర్కొంది.
"గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) రోజుకు సగటున 64.9 మెట్రిక్ టన్నుల ఆటో LPGని పంపిణీ చేశాయి. ఈ యుద్ధానికి ముందు ఈ పంపిణీ 57.6 మెట్రిక్ టన్నులుగా ఉండేది. ఇది సరఫరాలో పెరుగుదలను సూచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సరఫరా అవుతున్న సుమారు 4 లక్షల గృహ వినియోగ LPG సిలిండర్లు, దాదాపు 18,000 వాణిజ్య LPG సిలిండర్లకు ఇది అదనం" అని అది పేర్కొంది. అన్ని రంగాలకు నిరంతరాయంగా LPG సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Bengaluru Couple Death: ఇంట్లో భర్త ఆత్మహత్య.. 17వ ఫ్లోర్ నుంచి దూకిన భార్య
Bengaluru, Karnataka:Telangana Techie Couple Death: కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనయి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సహజీవనం చేసి ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు తమ గొడవలతో ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణకు చెందిన దంపతులు తాము పని చేసే బెంగళూరులో బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న భర్త మొదట ఆత్మహత్య చేసుకోగా.. ఇది తెలుసుకున్న భార్య దిగ్భ్రాంతికి లోనయి 17వ అంతస్తు పై నుంచి కిందకు ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో జరగ్గా.. తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: RR vs CSK Highlights: తొలి మ్యాచ్‌లోనే చెన్నై చెత్త ప్రదర్శన.. విజయంతో రాజస్థాన్ శుభారంభం
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32) బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తుండేవాడు. కొన్నేళ్ల కిందట పరిచయమైన బీబీ షాజియా సిరాజ్ (31)తో ప్రేమాయణం నడిపి అనంతరం ఇద్దరూ సహజీవనం చేశారు. అనంతరం వివాహం చేసుకుని ప్రస్తుతం బెంగళూరులోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటున్నారు. పెళ్లయినా కొన్నాళ్ల తర్వాత వారి కాపురంలో కలహాలు మొదలయ్యయి.
Also Read: New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!
కుటుంబ సమస్యలకు తోడు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయని తెలుస్తోంది. వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారని ఇరుగుపొరుగు వారు చెప్పారు. కుటుంబ కలహాలు, ఇతర సమస్యలు తట్టుకోలేక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో భర్త మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుని ఇంటి తలుపు తాళం వేసి ఉంచాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన భార్య షాజియా తాళం ఉండడంతో అవాక్కైంది. పదేపదే తలుపు తట్టినా లోపల ఉన్న భర్త స్పందించకపోవడంతో ఆమె ఆందోళనకు గురయ్యింది. వెంటనే సెక్యూరిటీని.. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు బలవంతంగా తలుపు తెరిచి చూశారు. అయితే అప్పటికే భాను చనిపోయి కనిపించాడు. భర్త మృతదేహాన్ని చూసి హతాశయురాలైన షాజియా ఏం చేయాలో పాలుపోలేదు. కొన్ని నిమిషాలు దిగ్భ్రాంతికి లోనయిన ఆమె తర్వాత తేరుకుంది. కొన్ని నిమిషాల తర్వాత షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
నిమిషాల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు తీసుకోవడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. వాటిని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సంఘటనలతో తెలంగాణలోని ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటనలకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Virat Kohli Flying Kiss: అనుష్క శర్మకి విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్..స్మృతి మంధాన ఎందుకు ఇలా చేసింది! ఫొటోలు వైరల్!
Bengaluru, Karnataka:Virat Kohli Flying Kiss Video: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రత్యర్థి టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ సిరీస్‌ను ప్రారంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది ఆర్సీబీ. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ ఆకట్టుకున్న ఆర్సీబీ జట్టు.. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఈ గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వైరల్..
దాదాపు 10 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ, తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ వెన్నుదన్నుగా నిలిచాడు. అతను కొట్టిన ప్రతి సిక్సర్‌కు మైదానంలోని అభిమానుల కోలాహలం చెవులు చిల్లులు పడేలా ఊర్రూతలూగించాయి.
అయితే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా చిన్నస్వామి స్టేడియానికి విచ్చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. కోహ్లీ చేసిన పనికి అనుష్క సిగ్గు పడుతూ తన భర్తకు తిరిగి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. అదే సమయంలో అనుష్క శర్మతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన కూడా అక్కడే ఉంది. ఆమెతో పాటు మరికొందరు ఆర్సీబీ మహిళా క్రికెటర్లు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ ఫ్లైయింగ్ కిస్ చూసి స్మృతి మంధాన దెబ్బకి షాక్‌కు గురైంది. అయితే అనుష్క శర్మకి కోహ్లీ కిస్ ఇస్తే స్మృతి మంధాన షాక్ అవ్వడం ఏంటని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 250కి పైగా పరుగులు చేస్తుందని అంచనా వేశారు. అయితే ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ తన అద్భుతమైన బౌలింగ్‌తో పవర్‌ప్లే ముగిసేలోపే సన్‌రైజర్స్ తొలి మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లందరూ వెంటవెంటనే అవుటయ్యారు.
ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగుల వద్ద అవుటయ్యాడు. అయితే, ప్రశాంతంగా ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అలాగే, చివరి దశలో తన సత్తా చాటిన యువ ఆటగాడు అనికేత్ వర్మ 43 పరుగులు చేశాడు. వీరి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు రాబట్టింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
🚨Smriti Mandhana’s look of surprise steals the moment 😲🔥
When Virat Kohli & Anushka Sharma exchange a flying kiss ❤️ pic.twitter.com/160UytG5MB
— Cricket Buzz (@arshdeep3444) March 28, 2026
ఆర్సీబీ అద్భుతమైన బ్యాటింగ్
202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఆరంభాన్ని అందుకుంది. ఓపెనింగ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 8 పరుగులకే ఔటైనప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ చక్కగా ఆడి జట్టుకు సునాయాస విజయానికి బాటలు వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ తన వంతుగా 12 బంతుల్లో 31 పరుగులు బాదాడు. దీంతో ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుత సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో అది కూడా సొంతగడ్డపై భారీ విజయం నమోదు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు. తక్కువ సమయంలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ, తమ బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో ఇతర జట్లకు సవాలు విసిరింది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఆర్సీబీ ఇదే ఫామ్‌తో విజయాలు కొనసాగిస్తుందో లేదో చూడాలి.
Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RCB vs SRH: ఐపీఎల్ 2026 ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు షాక్.. ఇషాన్ కిషన్ శ్రమ వృథా
Bengaluru, Karnataka:Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమవగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో అద్భుతం చేసినా బౌలింగ్‌లో విఫలమవడంతో కొత్త సీజన్‌ను సన్‌రైజర్స్ ఓటమితో ప్రారంభించగా.. ఆర్‌సీబీ విజయంతో శుభారంభం చేసింది. 201 లక్ష్యాన్ని ఆర్‌సీబీ 15 ఓవర్లలోనే ముగించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 7 పరుగులకే ఔటవగా.. ట్రావిడ్ హెడ్ 11 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ దంచికొట్టాడు. తుఫాన్ ఇన్సింగ్స్ ఆడి 38 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. నితీశ్ కుమార్ ఒక్క పరుగే చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. సలీల్ అరోరా 9కే ఔటవగా.. అనికేత్ వర్మ అద్భుతంగా ఆడి 43 పరుగులు జోడించాడు. హర్ష్ దుబే (3), హర్షల్ పటేల్ పరుగులు చేయలేకపోయారు. ప్రత్యర్థి ఆర్‌సీబీ తమ సొంత గడ్డపై అద్భుతంగా ఆడాడు. జాకబ్ డఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే నిప్పులు చెరిగి సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బతీశాడు. దీంతో ఒక దశలో హైదరాబాద్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు మాంచి స్కోర్‌తో రాణించారు. దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ తన మార్క్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (31) దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ విజయం సులువైంది. కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు జోడించడంతో బెంగళూరు 15.4 ఓవర్లలోనే 202 చేసి ఆర్సీబీ విజయం సాధించింది.
బ్యాటర్లు ఘనం.. బౌలర్లు విఫలం
తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ విఫలమవడంతో మళ్లీ జట్టు కూర్పుపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ పరంగా అదరగొట్టగా.. బౌలింగ్‌లోనే సన్‌రైజర్స్ తడబడింది. ఐపీఎల్ సీజన్ తొలి నుంచి సన్‌రైజర్స్ ప్రధాన లోపం బౌలింగ్ లేకపోవడం. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్‌ను బౌలర్లు కాపాడడంలో విఫలమవడంతో జట్టు పరాజయం వైపు నిలిచింది. గత సీజన్‌లలో కూడా ఇదే లోపంతో ఇబ్బందులు ఎదుర్కొన్న సన్‌రైజర్స్.. ఆ లోపం నుంచి బయటపడడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
பட்டாசாக வெடித்த படிக்கல்... முடித்துவைத்த விராட்... ஆர்சிபியின் சாதனை சேஸிங்!
Bengaluru, Karnataka:RCB vs SRH 2026 Highlights: ஐபிஎல் 2026 தொடர் இன்று தொடங்கியது. பெங்களூரு சின்னசாமி மைதானத்தில் இன்று நடந்த முதல் போட்டியில் நடப்பு சாம்பியன் ராயல் சேலஞசர்ஸ் பெங்களூரு அணியை, சன்ரைசர்ஸ் ஹைதராபாத் அணி எதிர்கொண்டது.
4 அறிமுக வீரர்கள்
கடந்தாண்டு கோப்பையை வென்ற வெற்றிக் கொண்டாட்டத்தின்போது, சின்னசாமி மைதானத்திற்கு வெளியே ஏற்பட்ட கூட்டநெரிசலில் 11 பேர் உயிரிழந்தனர். இந்த துயர சம்பவத்திற்கு இன்றைய போட்டிக்கு முன் மௌன அஞ்சலி செலுத்தப்பட்டது.
போட்டியின் டாஸை வென்ற ராயல் சேலஞ்சர்ஸ் பெங்களூரு அணியின் கேப்டன் ரஜத் பட்டிதார் பந்துவீச்சை தேர்வு செய்தார். ஆர்சிபி ரசிகர்கள் பலரும் எதிர்பார்த்த ஜேக்கப் பெத்தெல் இன்று விளையாடவில்லை. ஆர்சிபியில் ஜேக்கப் டஃப்பி மற்றும் அபிநந்தன் சிங் ஆகியோர் தங்களின் அறிமுக போட்டியை இன்று விளையாடினர். எஸ்ஆர்ஹெச் அணியில் சலீல் அரோரா மற்றும் டேவிட் பெய்ன் ஆகியோர் தங்களின் அறிமுக போட்டியில் விளையாடினர்.
மிரட்டிய ஜேக்கப் டஃப்பி
முதலில் பேட்டிங் செய்த எஸ்ஆர்ஹெச் அணிக்கு சற்றே மோசமான தொடக்கம்தான் கிடைத்தது. ஜேக்கப் டஃப்பி வீசிய 3வது ஓவரில் இருந்து ஹைதராபாத் அணியின் வீழ்ச்சி தொடங்கியது. அபிஷேக் சர்மா 7, டிராவிஸ் ஹெட் 11 என ஒரே ஓவரில் ஆட்டமிழந்தனர். அடுத்து டஃப்பி வீசிய 5வது ஓவரில் நிதிஷ் குமார் ரெட்டி 1 ரன்னில் வெளியேறினார். இருப்பினும் ஹைதராபாத் அணி பவர்பிளேவில் 49 ரன்களை அடித்து 3 விக்கெட்டை இழந்தது.
இஷான் கிஷன் 80
4வது விக்கெட்டுக்கு ஜோடி சேர்ந்த கேப்டன் இஷான் கிஷன் - ஹென்ரிச் கிளாசென் இணை சுமார் 97 ரன்களுக்கு பார்ட்னர்ஷிப் வைத்தனர். கிளாசென் 31 ரன்கள் எடுத்து பில் சால்டின் அற்புதமான கேட்ச்சால் ஆட்டமிழந்தார். அதையடுத்து சலீல் அரோரா 9 ரன்களில் ஆட்டமிழந்தார். அரைசதம் கடந்த இஷான் கிஷன் 16வது ஓவரில் ஆட்டமிழந்தார். அவர் 38 பந்துகளில் 8 பவுண்டரிகள், 5 சிக்ஸர்கள் என 80 ரன்களை அடித்து ஆட்டமிழந்தார்.
அதன்பின் அனிகேத் வர்மா மட்டுமே ஆறுதல் அளித்தார். இதனால், 20 ஓவர்கள் முடிவில் 9 விக்கெட் இழப்பிற்கு 201 ரன்கள் ஹைதராபாத் அடித்தது. அனிகேத் வர்மா 18 பந்துகளில் 3 பவுண்டரி, 4 சிக்ஸர் என 43 ரன்களை அடித்தார். ஆர்சிபி பந்துவீச்சில் ஜேக்கப் டஃப்பி மற்றும் ரொமாரியோ ஷெப்பர்ட் தலா 3 விக்கெட்டை கைப்பற்றினார்.
படிக்கலின் மிரட்டலடி
202 ரன்கள் என்ற பெரிய இலக்கை துரத்திய ஆர்சிபி அணியில் பில் சால்ட் 8 ரன்களில் ஆட்டமிழந்தார். ஆனால், 2வது விக்கெட்டுக்கு ஜோடி சேர்ந்த படிக்கல் - கோலி இணை 45 பந்துகளில் 101 ரன்கள் பார்ட்னர்ஷிப் அமைத்தது. படிக்கல் அதிரடியாக விளையாடி 26 பந்துகளில் 7 பவுண்டரி, 4 சிக்ஸருடன் 61 ரன்களை அடித்து ஆட்டமிழந்தார்.
முடித்துவைத்த விராட்
அடுத்து வந்த கேப்டன் ரஜத் படிதார் 12 பந்துகளில் 2 பவுண்டரி, 3 சிக்ஸருடன் 31 ரன்களை சேர்த்து ஆட்டமிழந்தார். ஜித்தேஷ் சர்மா டக்அவுட்டாகி ஏமாற்றமளித்தார். டிம் டேவிட் உடன் சேர்ந்து ஓபனரான விராட் கோலி ஆட்டத்தை முடித்து வைத்தார். 26 பந்துகளை மிச்சம்வைத்து ஆர்சிபி அணி 6 விக்கெட் வித்தியாசத்தில் வென்று, அதன் முதல் வெற்றியை பதிவு செய்தது.
Picking up exactly where th
— IndianPremierLeague (@IPL) March 28, 2026
Defending champions #RCB kick off their #TATAIPL 2026 campaign with a clinical, comprehensive victory ov
Updates https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH | @RCBTweets pic.twitter.com/q3IAaMP3LK
ஆட்ட நாயகன் ஜேக்கப் டஃப்பி
விராட் கோலி 38 பந்துகளில் 5 பவுண்டரி, 5 சிக்ஸருடன் 69 ரன்களை அடித்து ஆட்டமிழக்காமல் இருந்தார். சன்ரைசர்ஸ் அணியின் பந்துவீச்சு மிக சுமாராகவே இருந்தது. டேவிட் பெய்ன் 2 விக்கெட், ஹர்ஷ் தூபே, ஜெயதேவ் உனத்கட் தலா 1 விக்கெட்டையும் கைப்பற்றினர். ஆர்சிபி அணி சார்பாக 3 விக்கெட்டை வீழ்த்திய டஃப்பி ஆட்ட நாயகன் விருதை வென்றார்.
MI vs KKR மோதல்
ஐபிஎல் 2026 தொடரின் 2வது லீக் போட்டியில் ஹர்திக் பாண்டியா தலைமையிலான மும்பை இந்தியன்ஸ் - அஜிங்கயா ரஹானே தலைமையிலான கொல்கத்தா நைட் ரைடர்ஸ் அணிகள் நாளை (மார்ச் 29) மோதுகின்றன. மும்பை வான்கடே மைதானத்தில் இப்போட்டி நடைபெற உள்ளது.
சார்பில்லாத சமரசமில்லாத செய்திகள் உங்கள் உள்ளங்கைகளில்!
உடனுக்குடன் செய்திகளைத் தெரிந்து கொள்ளவும், உங்கள் கருத்துகளைப் பகிர்ந்து கொள்ளவும் சமூக வலைத்தளங்களில் எங்களைப் பின்தொடருங்கள்..
முகநூல் - @ZEETamilNews
ட்விட்டர் - @ZeeTamilNews
டெலிக்ராம் - https://t.me/ZeeTamilNews
வாட்ஸ்-அப் - https://whatsapp.com/channel/0029Va5XFvI90x2plF9cKY1r
அரசியல், கல்வி, பொழுதுபோக்கு, விளையாட்டு, சுகாதாரம், வாழ்க்கை முறை, சமூக, வேலைவாய்ப்பு என அனைத்து வகையான செய்திகளையும் தமிழில் பெற இப்போது ஜீ தமிழ் நியூஸ் செயலியைப் பதிவிறக்குங்கள்!!
Android Link: https://bit.ly/3AIMb22
Apple Link: https://apple.co/3yEataJ
RCB Vs SRH Preview: రాయల్ ఛాలెంజర్స్ Vs సన్‌రైజర్స్..ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో విజయం వారిదే?! ఎవరి బలమెంతో తెలుసా?
Bengaluru, Karnataka:RCB Vs SRH Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ నేడు మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయన్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న RCB ఆత్మవిశ్వాసంతో ఉండగా, గణాంకాల పరంగా హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్‌లు గెలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. అందులో మిగిలిన 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆర్సీబీపై సన్‌రైజర్స్ జట్టు ఆధిపత్యం పుష్కలంగా కనిపిస్తోంది.
ఆర్సీబీ బలాబలాలు..
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్‌లో కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో.. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడి ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారనుంది. గత సీజన్‌లో వీరిద్దరూ జట్టుకు ఘోరమైన ఆరంభాన్ని అందించారు.
అతనితో పాటు దేవదత్ పడిక్కల్ ఇటీవలే దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వీరి తర్వాత టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి భారీ హిట్టర్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ చేరికతో జట్టు మరింత సమతుల్యంగా మారింది.
ఆర్సీబీలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత ఆర్సీబీ బౌలింగ్ విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టు కీలక పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బ. హేజిల్‌వుడ్ లేని లోటును సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పూరించాల్సి ఉంటుంది. ఇప్పుడు భువి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. అదే విధంగా ఈ సీజన్‌లో యశ్ దయాల్ కూడా దూరంగా ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ ప్రదర్శన ఆర్సీబీకి చాలా కీలకం. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనపై జట్టు ఆశలు పెట్టుకుంది.
సన్‌రైజర్స్ బలాబలాలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లతో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, ప్రారంభ మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించే అవకాశం ఉంది. గత సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక పరుగులు సాధించాడు. అనికేత్ వర్మ గతేడాది ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. ఈసారి నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టన్ వంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ బాగా రాణిస్తే, హైదరాబాద్ భారీ స్కోరు సాధించడం ఖాయం.
బ్యాటింగ్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పాట్ కమిన్స్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అనే చెప్పాలి. ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఫాస్ట్ బౌలింగ్‌ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ కీలకంగా మారతాడు. హైదరాబాద్ జట్టులో స్పిన్ విభాగంలో పెద్ద ఆటగాళ్లు ఎవరూ లేరు. మొత్తంగా, నేటి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RCB Vs SRH Rain Prediction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..RCB Vs SRH మ్యాచ్ రద్దు అవుతుందా? షాకిచ్చిన వరుణుడు!
Bengaluru, Karnataka:RCB Vs SRH Rain Prediction News: మరో 24 గంటల్లో క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఘనంగా ప్రారంభం కానుంది. శనివారం అనగా మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తలపడనుంది. చాలా రోజుల తర్వాత చిన్నస్వామి స్టేడియంపై ఉన్న నిషేధం తొలగిపోవడంతో ఈసారి సొంత గడ్డపై ఆర్సీబీ ఆడనుంది.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇప్పుడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కూడా సిద్ధమైంది. గత కొన్ని మ్యాచ్‌లకు ఆ స్టేడియంపై నిషేధం విధించడంతో ఆర్సీబీ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో హోమ్ టీమ్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్‌లను నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతినిచ్చింది.
ఇందులో భాగంగానే ఐపీఎల్ 2026లో భాగంగా తొలిమ్యాచ్ ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరగనుంది. గత సీజన్ (ఐపీఎల్ 2025)లో ఈ స్టేడియంలో ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 2 గెలిచి, మూడింటిలో ఓడింది. ఈ స్టేడియంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద తిరుగులేని రికార్డు ఉంది. 106 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఏకంగా 3618 పరుగులు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు షాక్..
మార్చి 28న సాయంత్రం జరగబోయే ఐపీఎల్ తొలి మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయమై బెంగళూరు వాతావరణ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. రేపు అనగా శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందట. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం కురిసే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. కనీసం ఓవర్లు తగ్గించి మ్యాచ్‌ను పూర్తిచేసే అవకాశం ఉంది.
మార్చి 28 శనివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే అంతకుముందే 7:00 గంటలకు అంపైర్లు టాస్ వేస్తారు. అయితే ఈసారి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలు ఉండబోవని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను చూడవచ్చు. మరోవైపు మొబైల్ వినియోగదారులు జియో హాట్‌స్టార్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hotels Close: బెంగళూరు బంద్.. నేటి నుంచి హోటల్ ఇండస్ట్రీ మూసివేత!
Bengaluru, Karnataka:Bangalore Hotels Close: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణ.. అలజడులు నేపథ్యంలో అన్నీ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుండగా.. భారతదేశంపై మరింత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు చిక్కులు వచ్చిపడ్డాయి. ఇంధనం, గ్యాస్‌పై అంతా బాగానే ఉంది.. ఏం భయం అవసరం లేదని భారత ప్రభుత్వం పైకి గట్టిగానే చెబుతుండగా అంతర్గతంగా మాత్రం భయాందోళన చెందుతోంది. వంట గ్యాస్ కొరత ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గృహ వినియోగదారుల గ్యాస్‌పై ఎలాంటి ఆందోళన లేకపోయినా కమర్షియల్ గ్యాస్‌పై మాత్రం గందరగోళం ఏర్పడింది. ఈ గ్యాస్ కొరత ఉందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ కారణం చేత హోటళ్ల బంద్ చేపడతామని బెంగళూరులోని హోటళ్ల సంఘం ప్రకటించింది.
Also Read: Telangana CM: శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యం: తెలంగాణ సీఎం
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన వనరులపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సంఘర్షణలతో ఎగుమతులు, దిగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా చమురు, ఇంధనంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ కారణంగా వంటగ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తలు వస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం కారణంగా బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడిందని హోటళ్ల నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కారణంతో బెంగళూరు హోటళ్ల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా రేపటి నుంచి హోటళ్ల బంద్ కార్యక్రమం చేపడతామని సంచలన ప్రకటన చేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడతాయని ప్రకటించింది. హోటళ్ల బంద్ పిలుపుతో ఒక్కసారిగా బెంగళూరులో ఆందోళన నెలకొంది.
హోటళ్ల బంద్‌తో హోటల్ పరిశ్రమ కుదేలయ్యే అవకాశం ఉంది. రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వృద్దులు, అత్యవసర సేవలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని ప్రకటించింది. అయితే అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడంతో హోటల్ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని హోటల్ సంఘం తెలిపింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ నేపథ్యంలో అంతర్జాతీయం ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బపడింది. ఈ పరిస్థితుల్లో రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగరాదని.. ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. గ్యాస్ కొరతను నివారణ కోసం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్‌పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్‌పై తీవ్ర ప్రభావం పడింది. గృహ వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇక కమర్షియల్ గ్యాస్ సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు హోటల్ యజమానుల సంఘం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Social Media Ban: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..పిల్లలపై సోషల్ మీడియాలో నిషేధం..అసెంబ్లీలో ప్రకటన!
Bengaluru, Karnataka:Social Media Ban For Under 16: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సాంకేతికత, సామాజిక భద్రతపై పలు కీలక ప్రకటనలు చేశారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోబోతోంది.
కర్ణాటక రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ వ్యసనం నుండి చిన్నారులను రక్షించడం, వారి విద్యాభ్యాసంపై దృష్టి మరలకుండా చూడటం వంటి వాటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏఐ (AI) హబ్‌గా బెంగళూరు
రాష్ట్ర రాజధానిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరింత బలోపేతం చేసేందుకు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ఇస్రో, కియోనిక్స్, ఐఐఎస్సీ సహకారంతో బెంగళూరులో ఒక అత్యాధునిక రోబోటిక్స్, ఏఐ ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపుగా రూ.16 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ, నాస్కామ్ సహకారంతో రెండు కొత్త ఎక్సలెన్స్ సెంటర్లను స్థాపించనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,48,004 కోట్లుగా మొత్తం వ్యయాన్ని అంచనా వేశారు. అయితే సెప్టెంబర్ 2025లో జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత ఆదాయ వృద్ధి 10 శాతం నుండి 4 శాతానికి పడిపోయిందని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల వచ్చే ఏడాది రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.15,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పన్ను ఆదాయంలో కర్ణాటక దేశానికే అగ్రగామిగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటాలో అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు.
బెంగళూరులో పట్టణ వరదలను అరికట్టడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో రూ.5,000 కోట్ల వ్యయంతో ఐదేళ్ల విపత్తు నిర్వహణ ప్రాజెక్టును చేపట్టనున్నారు. బెంగళూరు శివార్లలో నివాస ప్రాంతాల్లోకి వచ్చే చిరుతపులులను రక్షించి, పునరావాసం కల్పించడానికి బన్నెర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో రూ.5 కోట్లతో ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.
పారదర్శకతను పెంచేందుకు ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. గ్రూప్-సి అధికారుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ కౌన్సెలింగ్ పద్ధతిని ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలకు కూడా వర్తింపజేయనున్నారు. సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అటు సంక్షేమ పథకాలను, ఇటు అత్యాధునిక సాంకేతిక అభివృద్ధిని సమతుల్యం చేస్తూ 'దూరదృష్టి'తో రూపొందించినట్లు చెప్పుకొచ్చారు.
Also Read: Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme 16 Pro: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్.. రిపబ్లిక్ డే సేల్‌లో Realme 16 Pro ఫోన్‌పై రూ.28 వేల తగ్గింపు!
Bengaluru, Karnataka:Realme 16 Pro Offer Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ లేటెస్ట్‌గా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) ఒకటి. దీనిని కంపెనీ ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేసింది. అయితే, ఇది ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంది. వెనక భాగంలోని కెమెరా మాడ్యూల్ గతంలో కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకు లభిస్తోంది. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro) అత్యంత తగ్గింపు ధరకి లభించడం విశేషం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో వచ్చిన మొట్టమొదటి రియల్ మీ మొబైల్‌గా కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. అలాగే ఇది 6,500 నిట్స్ (Nits) బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఇది ఇతర కాంతి ఉన్నచోట కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.
వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉంటుంది. రియల్ మీ బ్యాక్ సెటప్‌లో 200MP మెయిన్ కెమెరా (Samsung HP5 సెన్సార్, OIS సపోర్ట్) ప్రధాన కెమెరా అందించింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ Dimensity 7300 Max 5G చిప్‌సెట్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరీస్‌తో లభిస్తోంది. కానీ ఇది 8gb ర్యామ్ ని మాత్రం కలిగి ఉంటుంది. ఇక చివరి వేరియంట్ 12gb ర్యామ్‌తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.36,999 నుంచి ప్రారంభమవుతుంది.
స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే బేస్ వేరియంట్‌పై రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.28,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా అదనంగా భారీ తగ్గింపు పొందాలి అనుకునేవారు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.27 వేల వరకు బోనస్ లభిస్తుంది.. దీంతో మీరు కేవలం రూ.1,999 చెల్లిస్తే.. ఈ Realme 16 Pro స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Salary Hike: ఉద్యోగులకు సంక్రాంతి కానుక..17 శాతం జీతాల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్?!..మూడేళ్ల నిరీక్షణకు తెర!
Bengaluru, Karnataka:KSRTC Employees 17 Percent Hike: దాదాపు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ శుభవార్త అందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న జీతాల సవరణపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో రవాణా రంగ కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఎందుకు ఆలస్యమైంది?
సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో కాలానుగుణంగా జీతాల సవరణ జరుగుతుంది. అయితే KSRTCలో గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరిసారి గత బీజేపీ ప్రభుత్వం 2020లో జీతాలను సవరించినప్పటికీ, కరోనా సంక్షోభం కారణంగా అప్పట్లో పెంపుదల ఆశించిన స్థాయిలో లేదు. ఆ తర్వాత 2023లో సవరణకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
జీతాల పెంపు - కీలక వివరాలు:
ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. గతంలో 15 శాతం పెంపు ఉండగా, ఈసారి ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని 17 శాతం వరకు జీతాలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జీతాల పెంపు మార్చి 2027 నుండి అధికారికంగా అమలులోకి రానుందని విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ పెంపుదల జనవరి 2026 నుండి వర్తించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కార్మిక సంఘాల డిమాండ్ ఇదే?
ప్రభుత్వం జనవరి 2026 నుండి పెంపును వర్తింపజేయాలని చూస్తుండగా, ఉద్యోగ సంఘాలు మాత్రం జనవరి 2024 నుండే ఈ పెంపును వర్తింపజేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం నుండి మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
ఏకసభ్య కమిటీ సిఫార్సులు, కార్మిక సంఘాల చర్చల అనంతరం ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, సంక్రాంతి పండుగ పూట జీతాల పెంపు ప్రకటన రావడం KSRTC కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.
Also Read: Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?
Bengaluru, Karnataka:Gruhalakshmi Yojana Status Check: రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు అందించింది. సాంకేతిక కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రెండు విడతల సొమ్మును (రూ.4,000) నేటి నుండే (జనవరి 14) దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
24, 25వ విడతల నిధులు విడుదల
గృహలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 24వ, 25వ విడతలకు సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తొలి దశ: బెంగళూరుతో సహా 26 జిల్లాల్లో 25వ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
పెండింగ్ బకాయిలు: గతంలో నిలిచిపోయిన విడతల ఫైళ్లు కూడా చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ రూ.4,000 కూడా ఖాతాల్లో పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు.
ముఖ్యమైన వివరాలు..
లబ్ధిదారుల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.2 కోట్లకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
నిధుల జమ: పండుగ కానుకగా నేటి నుండే దశలవారీగా నగదు బదిలీ ప్రక్రియ మొదలైంది. ఒకేసారి కాకుండా జిల్లా వారీగా అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి.
రేషన్ కార్డు రద్దు అయితే పరిస్థితి ఏంటి?
ఇటీవల ప్రభుత్వం అనర్హులైన వారి BPL (బిపిఎల్) కార్డులను రద్దు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సందేహాలు తలెత్తాయి.
అర్హత ఉంటేనే: ఒకవేళ పొరపాటున అర్హత కలిగిన లబ్ధిదారుల కార్డు రద్దు అయితే, వారు తగిన ఆధారాలతో అధికారులకు వివరణ ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునరుద్ధరించుకోవచ్చు.
నిబంధన: లబ్ధిదారురాలు ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారు అయి ఉండకూడదు.
అక్రమాలపై వేటు: అక్రమంగా కార్డులు పొందిన వారిపై చర్యలు తీసుకుంటూనే, నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
పండుగ పూట తమ ఖాతాల్లోకి డబ్బులు చేరుతుండటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ ఖాతాలోకి నగదు జమ అయిందో లేదో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే మెసేజ్ ద్వారా లేదా సంబంధిత వెబ్‌సైట్‌లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bengaluru Techie Sharmila: ఆమెకు 34..అతనికి 18..మిడ్‌నైట్ రూమ్‌లోంచి గట్టి గట్టిగా అరుపులు, కేకలు..అంతలోనే!
Bengaluru, Karnataka:Bengaluru Techie Sharmila Case: బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ షర్మిల (35) కేసులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇది ప్రమాదకర అగ్నిప్రమాదం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో కేరళకు చెందిన 18 ఏళ్ల పీయూసీ (PUC) విద్యార్థి కల్నల్ కురైని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
మంగళూరుకు చెందిన షర్మిల.. రామమూర్తి నగర్‌లోని ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో తన స్నేహితురాలు షబరీన్‌తో కలిసి నివసిస్తోంది. షబరీన్ పని నిమిత్తం ఢిల్లీకి వెళ్లడంతో గత 15 రోజులుగా షర్మిల ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న పొరుగింటి విద్యార్థి కల్నల్ కురై జనవరి 3వ తేదీ రాత్రి బాల్కనీ గుండా ఆమె ఫ్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు.
ఒన్‌సైడ్ లవ్..దాడి..హత్య
నిందితుడు కురైకి షర్మిల అంటే ఒన్‌సైడ్ లవ్ ఉందని, ఆ రాత్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. షర్మిల దీనిని తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించడంతో, ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెపై భౌతిక దాడి చేసి హతమార్చాడు.
సాక్ష్యాల ధ్వంసం కోసం అగ్నిప్రమాదం సృష్టి
హత్య చేసిన తర్వాత ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నిందితుడు కిరాతక ప్లాన్ వేశాడు. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయని నమ్మించడానికి.. స్నేహితురాలు షబరీన్ ఉన్న బెడ్‌రూమ్‌కు నిప్పు పెట్టాడు. దీంతో ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. కానీ, షర్మిల మృతదేహం వంటగదిలో లభించింది. ఆమె శరీరంపై ఎలాంటి కాలిన గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో తేలిన నిజాలు
మొదట అగ్నిప్రమాదంగా భావించినప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినప్పుడు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేవలం ఒక బెడ్‌రూమ్ మాత్రమే తగలబడటం, హాల్, కిచెన్ సురక్షితంగా ఉండటం. మద్యం బాటిల్ ఉన్నప్పటికీ పార్టీ జరిగిన ఆనవాళ్లు లేకపోవడం. పోస్ట్‌మార్టం రిపోర్ట్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
నిందితుడు కల్నల్ కురైని అదుపులోకి తీసుకున్న రామమూర్తి నగర్ పోలీసులు, కోర్టు అనుమతితో అతడిని మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానిక అపార్ట్‌మెంట్ వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme Neo 8 Turbo: 8000mAh బ్యాటరీతో Realme Neo 8 Turbo త్వరలో లాంచ్.. ఫీచర్స్ విడుదలకు ముందే లీక్..
Bengaluru, Karnataka:Realme Neo 8 Turbo 5G Launch Date In India: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme మీ తమ మరో కొత్త టర్బో సిరీస్ మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ 2026 సంవత్సరం లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. విడుదలకు ముందే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ Realme Neo 8 Turbo పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Realme Neo 8 Turbo స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన కెమెరా సెట్ అప్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ లెన్స్‌తో 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్ హైయ్యండ్ మోడల్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 8000 mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇవే కాకుండా ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ HD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. దీంతోపాటు ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకమైన ప్రొటెక్షన్ గ్లాస్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక ఇందులో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ కూడా లభిస్తోంది. Realme Neo 8 Turbo స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఇతర కెమెరా వివరాల్లోకి వెళ్తే.. అదనంగా ఈ మొబైల్‌కి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా లభిస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 8000 mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది.. ఇక ఈ మొబైల్ ను కంపెనీ Realme UI 7.0తో Android 16 ఆపరేటింగ్ సిస్టంతో విడుదల చేస్తుంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
Realme నియో 8 టర్బో స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన విడుదల తేదీ వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన విడుదల, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ అధికారిక సమాచారం ప్రకారం ఈ మొబైల్ ను మొదటగా చైనాలో 2026 సంవత్సరం రెండవ నెలలో లేదా మూడవ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదల చేసిన తర్వాతే ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్‌లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
